News September 18, 2025

మంచిర్యాల: సింగరేణిలో ఈపీ ఆపరేటర్లకు శుభవార్త

image

సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న అర్హత గల ఈపీ ఆపరేటర్లకు శుభవార్త.. ఎక్స్ కవేషన్ కేటగిరీ- డి నుంచి ఎక్స్ కవేషన్ కేటగిరీ-సి, ఎక్స్ కవేషన్ కేటగిరీ-సి నుంచి ఎక్స్ కవేషన్ కేటగిరీ-బికి త్వరలో పదోన్నతులు లభించనున్నాయి. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 150 మంది ఆపరేటర్లు పదోన్నతి పొందనున్నారు. కేటగిరీ- డిలో రెండేళ్లు, కేటగిరీ- సిలో మూడేళ్లు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.

Similar News

News September 19, 2025

NGKL: సీఎంకు ఆహ్వానం అందజేత

image

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ సభ్యులు ఆహ్వానించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి వారు గురువారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జూలూరి రమేష్ బాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News September 19, 2025

VKB: ‘సర్వే రిపోర్ట్ నివేదిక సరైన విధంగా అందించాలి’

image

జిల్లా సర్వే నివేదిక రిపోర్టు సంబంధిత శాఖలు సమన్వయంతో రిపోర్ట్ తయారు చేసి అందజేయాలని అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో పరిశ్రమలు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అదన కలెక్టర్ మాట్లాడుతూ.. రిపోర్టు ఆధారంగానే జిల్లాలో పరిశ్రమలకు, ఇసుక, పర్యావరణ అనుమతులకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

News September 19, 2025

NGKL: సోషల్ మీడియా ప్రకటనలు నమ్మోద్దు: ఎస్పీ

image

సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన బంపర్ ఆఫర్లు, దసరా బహుమతుల ప్రకటనలను నమ్మోద్దని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రజలకు సూచించారు. తక్కువ ధరలకే వస్తువులు ఇస్తామని వచ్చే మోసపూరిత సందేశాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. స్పిన్ వీల్, స్క్రాచ్ కార్డుల లాంటి లింకులను అస్సలు క్లిక్ చేయవద్దని ఆయన తెలిపారు.