News February 3, 2025

మంచిర్యాల: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

image

మంచిర్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 39 సెంటర్లు ఏర్పాటు చేయగా ప్రాక్టికల్ రాసే జనరల్ విద్యార్థులు 3,850 మంది, ఒకేషనల్ రాసే విద్యార్థులు 1936 మంది విద్యార్థులు ఉన్నారు. హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.

Similar News

News February 26, 2026

శ్రీవారికి నగదే కాదు ‘ముడుపు పత్రాలు’ సమర్పించవచ్చు!

image

AP: తిరుమలలో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు కొత్త విధానాన్ని TTD అమలు చేయనుంది. త్వరలో ‘శ్రీవారి ముడుపు పత్రం’ పేరుతో ప్రత్యేక పత్రాలను జారీ చేయనుంది. ₹100 నుంచి ₹లక్ష వరకు UPI, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసి హుండీలో సమర్పించవచ్చు. క్యాష్‌లెస్ లావాదేవీలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి జరిగే TTD బోర్డు మీటింగ్‌లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

News February 26, 2026

నంద్యాల జిల్లా నేతలకు మంత్రి లోకేశ్ విందు

image

ఉండవల్లి నివాసంలో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ కూటమి ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరితో పాటు డోన్, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, నంద్యాల, నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించిన అనంతరం, మంత్రి వారికి మంగళగిరి పట్టుచీరలను బహూకరించారు. అందరూ కలిసి మంత్రి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

News February 26, 2026

ALERT: కాజీపేటలో కల్తీ ఐస్‌క్రీం స్వాధీనం

image

కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురిలో టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కల్తీ ఐస్‌క్రీంలతో పాటు గడువు తీరిన రూ.60,400 విలువలైన 12 రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ACP మధుసూదన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని విచారణ నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.