News August 14, 2025

మంచిర్యాల: సెప్టెంబర్‌లో రాష్ట్ర స్థాయి గో విజ్ఞాన పరీక్షలు

image

సెప్టెంబర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి గో విజ్ఞాన పరీక్షల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం రాష్ట్రీయ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంచిర్యాల డీఈఓ యాదయ్యకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం పరిషత్ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కొట్టే నటేశ్వర్, బీజేపీ నాయకుడు కిషోర్ మాట్లాడుతూ.. ఈ పరీక్షల్లో విజేతలకు ప్రథమ రూ.లక్ష, ద్వితీయ రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25 వేలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

Similar News

News August 15, 2025

తిరుపతి: M.Sc ఫలితాల విడుదల

image

తిరుపతి శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీలో జులైలో M.Sc బోటనీ 4వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. సంబంధిత ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. www.spmvv.ac.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.

News August 15, 2025

రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, భద్రాద్రి, జనగామ, ఖమ్మం, మెదక్, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయంది.

News August 15, 2025

త్రివర్ణ శోభతో ముస్తాబైన కామారెడ్డి కలెక్టరేట్

image

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ త్రివర్ణ రంగుల విద్యుత్ కాంతులతో చూపరులను ఆకట్టుకుంటుంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల విద్యుత్ కాంతులతో కలెక్టరేట్ భవనాన్ని ముస్తాబు చేశారు. రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ ఛైర్మన్ కోదండ రెడ్డి పాల్గొననున్నారు.