News January 27, 2026
మంచిర్యాల: హత్యాయత్నం కేసులో జైలు శిక్ష

హత్యాయత్నం కేసులో నిందితుడికి 3సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మంచిర్యాల సీనియర్ సివిల్ జడ్జి నిర్మల విధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మందమర్రి పెట్రోల్ బంకు సమీపంలో డబ్బుల లావాదేవీల విషయంలో జరిగిన గొడవల్లో కుమారస్వామి చంపాలనే ఉద్దేశంతో కత్తితో దాడి చేయగా బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి ఎస్సై సతీశ్ కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో జడ్జి శిక్ష ఖరారు చేశారు.
Similar News
News February 20, 2026
కోతికి కొబ్బరిచిప్ప.. ట్రంప్‌కు అధ్యక్ష పదవి

మొన్నటిదాకా నోబెల్ శాంతి పురస్కారం కోసం తపించిన ట్రంప్‌కు కొత్త కోరిక పుట్టింది. స్వతహాగా రియల్టరైన తన పేరిట శాశ్వత నిర్మాణాలు లేకపోతే అమెరికాకు కళ ఉండదని కలగన్నారేమో. రాజధాని వాషింగ్టన్‌లోని కెనడీ స్మారక కాంప్లెక్సును ట్రంప్-కెనడీ సెంటర్‌గా మార్చేందుకు సైన్ చేసేసుకున్నారు. తాజాగా ప్రఖ్యాత పామ్ బీచ్ ఎయిర్‌పోర్టుకు ట్రంపన్న పేరు పెట్టి అనుగ్రహం పొందేందుకు ఫ్లోరిడా అసెంబ్లీ బిల్ పాస్ చేసింది. కర్మ!
News February 20, 2026
బాపట్ల జిల్లాలో రబీకి అందుబాటులో యూరియా

బాపట్ల జిల్లాలో రబీ సీజన్‌కు 7,443 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాలు, మార్క్‌ఫెడ్ గోదాములు, ప్రైవేట్ రిటైలర్ల వద్ద నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. 45 కిలోల యూరియా బస్తా ధర రూ.266.50గా నిర్ణయించబడిందన్నారు. అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 20, 2026
సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


