News September 9, 2025
మంచిర్యాల: 11న మినీ జాబ్ మేళా

మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. హైదారాబాద్‌లోని హెటేరో కంపెనీలో 40 జూనియర్ ఆఫీసర్, 100 జూనియర్ కెమిస్ట్ ట్రైనీ, 60 జూనియర్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 9, 2025
కృష్ణానదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

కొల్లూరు మండలం పెసర్లంక సమీపంలోని అరవింద వారధి కృష్ణానదిలో గల్లంతైన యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు తహశీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చింతల్లంక గ్రామానికి చెందిన తోడేటి హర్షవర్ధన్ (22) ఆదివారం రాత్రి కృష్ణానదిలో గల్లంతయ్యాడు. అతని మృతదేహం కృష్ణాజిల్లా నాగాయలంక మండలం కొత్తపాలెంలో లభ్యమైంది.
News September 9, 2025
సూర్యాపేటలో క్యాన్సర్ చికిత్స వార్డు ప్రారంభం

సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స వార్డును మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. జిల్లాలో క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి త్వరగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వార్డును ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఇకపై చికిత్స కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే ఉచితంగా వైద్యం, మందులు పొందవచ్చని సూచించారు.
News September 9, 2025
వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం అభినందనీయం: కలెక్టర్

ఒంగోలు నగర కార్పోరేషన్‌తో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐటీసీ సంస్థ సరికొత్త కాన్సెప్ట్‌తో చొరవ తీసుకుంది. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురం, కనిగిరి మున్సిపాలిటీలు వ్యర్థాల నిర్వహణపై ఎంఓయూ పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వారు మంగళవారం ఒంగోలులో కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిశారు. ఇది అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.