News December 17, 2025
మంచిర్యాల: 5 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా ధర్మరాజు

మూడో విడత స్థానిక ఎన్నికల్లో భాగంగా చెన్నూర్ మండల పరిధిలోని 30 గ్రామ పంచాయతీలకు బుధవారం ఎన్నికలు ముగిశాయి. మండలంలోని బీరెల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి దుర్గం ధర్మరాజు 5 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థిపై విజయం సాధించారు. కాంగ్రెస్ శ్రేణులు, యువకులు సంబరాలు చేసుకుంటున్నారు.
Similar News
News February 17, 2026
IOCL దిగ్బోయ్ రిఫైనరీలో పోస్టులు

<
News February 17, 2026
కుటుంబ కలహాలు తొలగేందుకు పరిహారాలు

కుటుంబంలో ప్రశాంతత కోసం వాస్తు నిపుణులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. వాటి ప్రకారం.. ప్రతికూల శక్తిని పోయేందుకు ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కకు నిత్యం నీరు పోయాలి. అదే దిశలో రాగి/ఇత్తడి బిందెతో నీటిని ఉంచాలి. దృష్టి దోషాలు పోవాలంటే దక్షిణాన పంచముఖ ఆంజనేయ ఫోటోను ఉంచాలి. అలాగే లక్ష్మీ గణపతి విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సానుకూల శక్తితో ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది.
News February 17, 2026
మొక్కల పెరుగుదలలో పోషకాల పాత్ర కీలకం

☛ యూరియా: మొక్కల్లో ఆకుల పెరుగుదల, కాండం వృద్ధి, పచ్చదనానికి కారణమవుతుంది. ☛ భాస్వరం: మొక్కల వేర్ల అభివృద్ధికి అవసరం ☛ పొటాష్: మొక్కల ఆరోగ్యం, గింజలు, కాయల నాణ్యతలో కీలక పాత్ర పోషిస్తుంది.
☛ ఇక జింక్, ఇనుము, బోరాన్, కాపర్ వంటి సూక్ష్మపోషకాలు తక్కువ పరిమాణంలో అవసరమైనా పంటలకు చాలా కీలకం. ఇవి పూత రాలిపోకుండా, కాయలు సక్రమంగా ఏర్పడేలా చేస్తాయి. మొక్కల అంతర జీవక్రియలు సక్రమంగా జరగడానికి సహాయపడతాయి.


