News February 24, 2025

మంచిర్యాల: CM రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్

image

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి బయలు దేరి 11.50 నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడ సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మంచిర్యాల జిల్లాలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి కరీంనగర్ బయలుదేరుతారు.

Similar News

News October 28, 2025

క్యాబిన్ క్రూ జాహ్నవి గుప్తా ఆత్మహత్య

image

రాజేంద్రనగర్ పరిధిలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్ క్రూ‌గా పనిచేస్తున్న జాహ్నవి గుప్తా ఆత్మహత్య చేసుకుంది. జమ్మూకు చెందిన జాహ్నవి, ఇటీవల ఇండిగో క్యాప్టెన్, స్నేహితుడితో కలిసి పార్టీకి హాజరై, అనంతరం తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కొన్ని రోజులుగా ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలను మాత్రం తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించడం లేదు.

News October 28, 2025

చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

NLG: చెకుముకి సైన్స్ సంబరాలు 2025 పోస్టర్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. పాఠశాల స్థాయిలో 8, 9 10వ తరగతుల విద్యార్థులకు సైన్స్ టెంపర్‌ని అవగాహన కల్పించేలా ప్రతి ఏటా జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహణకు సహకరించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో దేవరకొండ ఏఎస్పీ మౌనిక, జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

News October 28, 2025

ఆగిన రష్యన్ ఆయిల్ దిగుమతులు.. నెక్స్ట్ ఏంటి?

image

రష్యాలోని టాప్ ఎనర్జీ కంపెనీలపై US ఆంక్షల నేపథ్యంలో భారత రిఫైనరీలు కొత్తగా ఆయిల్ దిగుమతులపై వెనుకడుగు వేస్తున్నాయి. పేమెంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణం. ఈ విషయంలో ప్రభుత్వం, సప్లయర్ల నుంచి క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫ్రెష్ ఆయిల్ టెండర్ జారీ చేసిందని, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పాట్ బయ్యింగ్‌కు సిద్ధమైందని తెలిసింది.