News March 20, 2025
మంచిర్యాల: KC వేణుగోపాల్‌ను కలిసిన ఎంపీ వంశీ

పార్లమెంట్ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్‌ను కలిసి బడ్జెట్, కుల గణన, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల అమలుపై మాట్లాడారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 15, 2026
ESIC వారణాసిలో 51 పోస్టులకు నోటిఫికేషన్

ESIC వారణాసి 51పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు FEB 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD/MS అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,23,100, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.78,800,అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్‌కు రూ.67,700, ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. సైట్: esic.gov.in
News February 15, 2026
నంద్యాల: ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ రచయిత మృతి

‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అనే పుస్తకంతో చర్చనీయాంశంగా మారిన రచయిత నందికొట్కూరు మండలం అల్లూరుకు చెందిన <<19145947>>శ్రీనివాస్<<>>(48) మృతిచెందారు. నిన్న ఆయన ప్రయాణిస్తున్న కారు ఖమ్మం జిల్లా కూసుమంచి(M) పాలేరు జలాశయంలోకి దూసుకెళ్లింది. వెనుక భాగంలో కూర్చున్న శ్రీనివాస్ నీటిలో మునిగి మరణించగా, డ్రైవర్ కారులో నుంచి కిందపడి అక్కడి నుంచి పరారైనట్లు అనుమానిస్తున్నారు.
News February 15, 2026
నెల్లూరు: ప్రిన్సిపల్ సంతకం లేకున్నా.. ఓకే!

నెల్లూరు జిల్లాలో ఈనెల 23వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజు బకాయిలు పేరుతో విద్యార్థులను కాలేజీ వాళ్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐవో వరప్రసాద్ రావు హెచ్చరించారు. ప్రభుత్వ వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపల్స్ సంతకం లేకున్నా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.


