News March 14, 2025
మంచిర్యాల: PHOTO OF THE DAY

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా చిన్నారులు రంగులు పూసుకొని సందడి చేసిన ఫొటో ఆకట్టుకుంటుంది. జిల్లాలోని యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. పలు గ్రామాల్లో చేసిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. మీ ప్రాంతంలో హోలీ ఎలా జరిగిందో కామెంట్ చేయండి.
Similar News
News December 29, 2025
ధనుర్మాసం: పద్నాలుగో రోజు కీర్తన

‘సఖీ! అందరినీ లేపుతానన్న వాగ్దానం మరిచి నిద్రిస్తున్నావా? తెల్లవారింది, కలువలు విచ్చుకున్నాయి. మునులు, యోగులు గుడి తలుపులు తీసేందుకు తాళాలతో వెళ్తున్నారు. ఇవన్నీ ఉదయానికి సూచనలే కదా! పంకజాక్షుడైన ఆ కృష్ణుని శంఖచక్రాల సౌందర్యాన్ని, ఆయన గుణగణాలను మనమంతా కలిసి కీర్తించాలి. నీవు వెంటనే మేలుకో, గోష్టిగా సంకీర్తన చేస్తేనే మన వ్రతం ఫలిస్తుంది” అంటూ గోదాదేవి తొమ్మిదవ గోపికను మేల్కొలుపుతోంది. <<-se>>#Dhanurmasam<<>>
News December 29, 2025
ఇండియా ‘విశ్వ గురువు’ కావాలి: RSS చీఫ్

ప్రపంచ సంక్షేమం కోసం హిందువులు భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలని అన్నారు. ‘ప్రపంచం మన వైపు చూస్తోంది. భారత్ విశ్వ గురువు కావడం మన ఆశయం కాదు.. ప్రపంచానికి అవసరం. ఇందుకు చాలా కష్టపడి పని చేయాలి’ అని చెప్పారు. హైదరాబాద్లో జరిగిన విశ్వ సంఘ్ శిబిర్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
News December 29, 2025
శ్రీ సత్యసాయి: ఎన్నికలు ఏకగ్రీవం

శ్రీ సత్యసాయి జిల్లా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా శాఖా ఎన్నికలు కలెక్టరేట్లో ఆదివారం జరిగినట్లు ఎన్నికల అధికారి దివాకర్ రావు వెల్లడించారు. హిందూపురం డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయ డీటీ గిరిధర్ అసోసియేట్ అధ్యక్షుడిగా, పుట్టపర్తి డీటీ కళ్యాణ చక్రవర్తి కార్యదర్శిగా, సోమందేపల్లి డీటీ శ్రీకాంత్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


