News December 13, 2025
మంచి నాయకుడి కోసం.. ఒక్కరోజు వెచ్చిద్దాం!

పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటూ వజ్రాయుధమే. ఊరిని అభివృద్ధి చేసే సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడం మన బాధ్యత. ఒక్కరోజు సెలవు, కూలీ డబ్బులు పోయినా పర్వాలేదు.. మన ఊరి భవిష్యత్తు కోసం వచ్చామన్న తృప్తి ముఖ్యం. మీ ఓటుతో మంచి నాయకుడు గెలిస్తే ఆ ఊరంతా బాగుపడుతుంది. అందుకే డబ్బు, బంధుప్రీతి వంటి ప్రలోభాలకు లొంగకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి. నిజాయితీ గల నాయకుడిని గెలిపించండి.
Similar News
News December 14, 2025
హనుమకొండ: సర్పంచ్‌గా అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య..!

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి అడేపు స్రవంతి దయాకర్ 142 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఆమె గెలుపు ఖరారైంది. గతంలో ఆమె భర్త అడేపు దయాకర్ సర్పంచ్‌గా పని చేయగా, ఇప్పుడు స్రవంతి ప్రజల మద్దతుతో పీఠాన్ని దక్కించుకున్నారు. గ్రామంలో ఆమె గెలుపుతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
News December 14, 2025
పెద్దగూడెం సర్పంచ్‌గా పుష్పలత శివకుమార్

పెద్దగూడెం గ్రామ సర్పంచ్‌గా స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ మద్దతురాలు పుష్పలత శివకుమార్ సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పై 749 ఓట్ల భారీ మెజార్టీ గెలుపొందారు. అదేవిధంగా 12 వార్డులకు గాను 11 వార్డులలో వార్డు మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పుష్పలత శివకుమార్‌ను శివసేనారెడ్డి అభినందించారు.
News December 14, 2025
భూపాలపల్లి: 23 ఏళ్లకే సర్పంచ్

జిల్లాలోని టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ యువ అభ్యర్థి సంగి అంజలి (23) విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై 41 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంజలి విజయం గ్రామ యువతలో నూతన ఉత్సాహాన్ని నింపింది. తక్కువ వయస్సులోనే ప్రజల విశ్వాసాన్ని ఆమె సంపాదించారు.


