News January 3, 2026

మంచి పశుగ్రాసానికి ఉండాల్సిన లక్షణాలు

image

పాడి పశువులకు అందిచే గ్రాసం రుచిగా, ఎక్కువ మాంసకృత్తులు కలిగి ఉండాలి. తక్కువ కాలంలో కోతకు వచ్చి ఎక్కువ దిగుబడి ఇచ్చేదిగా ఉండాలి. నీటి ఎద్దడిని తట్టుకొని ఏ దశలో కోసినా రుచికరంగా ఉండాలి. ఎలాంటి విష పదార్థాలు ఉండకూడదు. అన్ని కాలాల్లో మంచి దిగుబడిని ఇవ్వాలి. అన్ని రకాల నేలల్లో తక్కువ నీటితో సాగు చేసుకోగలినదై ఉండాలి. తెగుళ్లను తట్టుకునేలా, కోసిన తర్వాత రోజుల తరబడి నిల్వచేసుకొనుటకు వీలుగా ఉండాలి.

Similar News

News February 21, 2026

షాకింగ్.. ఒకే పార్కులో 72 పులులు మృతి

image

థాయ్‌లాండ్‌లోని ఓ ప్రైవేట్ పార్క్‌లో డెడ్లీ వైరస్ విజృంభించింది. దీంతో ఈనెల 8-19వ తేదీ మధ్య 72 పులులు మృత్యువాతపడ్డాయి. కనైన్ డిస్టెంపర్ వైరస్(CDV) కారణంగానే అవి చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంటువ్యాధి సోకగానే జ్వరం, కళ్ల నుంచి నీరు కారుతుంది. వాంతులు, విరేచనాలు వస్తాయి. కండరాలు బలహీనమై మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. ముందస్తు టీకాతో నివారించవచ్చు. ఇది మనుషులకు సోకదు.

News February 21, 2026

లిక్కర్ స్కామ్.. A2 వాసుదేవరెడ్డి అరెస్ట్

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A2గా ఉన్న వాసుదేవరెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి పని చేశారు. గతంలో ఈయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.

News February 21, 2026

గొర్రెల పెంపకం – పాక్షిక సాంద్ర పద్ధతి

image

పాక్షిక సాంద్ర పద్ధతిలో గొర్రెలను కొద్ది గంటల పాటు పచ్చిక బయళ్లలో మేపి మిగతా సమయం అంతా ఇంటివద్ద పాకలలో ఉంచి పెంచుతారు. అంతేకాక పాకలలో వాటికి పచ్చిగడ్డి, దాణా, త్రాగటానికి నీరు మొదలగునవి పెడతారు. ఈ పద్ధతిలో ఎంపిక చేసిన పొట్టేళ్లతోనే ఆడ గొర్రెలను జతకలపవచ్చు. బయట వృథాగా ఉన్న పచ్చిక బయళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.