News September 20, 2024

మంజూరైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి: ఎండీ

image

విశాఖ జిల్లాలో మంజూరైన ప్రతి ఇంటిని అధికారులు దగ్గరుండి నిర్మాణాన్ని పూర్తి చేయించాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ రాజాబాబు ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గృహ నిర్మాణాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులకు కాంట్రాక్టర్లకు అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో జేసి మయూర్ అశోక్ పాల్గొన్నారు.

Similar News

News September 20, 2024

విశాఖ: అత్యాచారం కేసులో సంచలన తీర్పు

image

విశాఖలో బాలికపై అత్యాచారం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ముద్దాయి జీ.వెంకట రమణకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. ప్రభుత్వం నుంచి బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆనందీ తీర్పు వెలువరించారు.

News September 20, 2024

వైసీపీని రద్దు చేయాలని కోరుతాం: గంటా

image

జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదని, వైసీపీని రద్దు చేస్తే దేశానికి మంచిదని ఎలక్షన్ కమిషన్‌ను కోరనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.ఆనందపురంలో శుక్రవారం జరిగిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదమైన లడ్డూలో జంతువు కొవ్వు అవశేషాలున్నట్టు తేలడంతో హిందూ సమాజం నివ్వెర పోయిందన్నారు.

News September 20, 2024

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం రమేశ్

image

తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఈ సంఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.