News February 25, 2025
మండపేటలో స్కూల్ భవనం పైనుంచి దూకిన విద్యార్థిని

తండ్రి మందలించాడని విద్యార్థిని స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండపేటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మహమ్మద్ పజియా(14) ఖాళీ సమయంలో స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. పాల్పడింది. గాయాలైన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
Similar News
News November 3, 2025
ఉపగ్రహాలతో గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రించొచ్చు: మస్క్

వాతావరణ మార్పులపై ఆందోళన పెరుగుతున్న వేళ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఏఐతో నడిచే భారీ ఉపగ్రహాల సముదాయంతో గ్లోబల్ వార్మింగ్‌ను నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భూమిని చేరే సౌర శక్తి మొత్తంలో చిన్న సర్దుబాట్లు చేయడం ద్వారా వాతావరణాన్ని నియంత్రించవచ్చని మస్క్ ట్వీట్‌లో పేర్కొన్నారు. సహజ పరిణామాన్ని నిరోధిస్తే ముప్పు తప్పదని కొందరు ఆయనకు కౌంటర్ వేస్తున్నారు.
News November 3, 2025
MBNR: ఈనెల 7న దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ఈ నెల 7వ తేదీన మహబూబ్‌నగర్ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
News November 3, 2025
ఎన్టీఆర్: MBA/MCA పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో MBA/MCA చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. NOV 13 నుంచి 24 మధ్య MBA, NOV 13 నుంచి 18 మధ్య MCA పరీక్షలను (ఉదయం 10-మధ్యాహ్నం ఒంటిగంట సెషన్‌లో)వర్సిటీ పరిధిలోని 5 కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు https://kru.ac.in/ చూడాలని కోరారు.


