News April 15, 2024
మండపేటలో 1000 మందికి పైగా వాలంటీర్ల రాజీనామా

ఉమ్మడి తూ.గో జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈరోజు మండపేట నియోజకవర్గానికి చెందిన 1000 మందికి పైగా రాజీనామా చేశారు. వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు సమక్షంలో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వైసీపీకి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని వారు స్పష్టం చేశారు. తోట త్రిమూర్తులుకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధించిందన్నారు.
Similar News
News October 7, 2025
రాజమండ్రిలో వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ ఆరా

ప్రభుత్వ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ కీర్తి చేకూరి ఆరా తీశారు. మంగళవారం ఆమె రాజమండ్రిలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. పలు వార్డులు, పరికరాలు, రికార్డులు పరిశీలించారు. మందుల నిల్వలు, పరిక్షల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలన్నారు. పారిశుద్ధ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.
News October 7, 2025
ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకతకు కృషి: జేసీ

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) మరింత పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నాయని జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 871 చౌకధరల దుకాణాలు సక్రమంగా పనిచేస్తున్నాయన్నారు. రేషన్ కార్డుదారులకు 93% నుంచి 94% వరకు నిత్యావసర వస్తువులు సమయానికి సరఫరా అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
News October 6, 2025
నవోదయం 2.0 సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నాటుసారా తయారు చేసినా, రవాణా చేసినా, అమ్మకాలు జరిపినా వెంటనే కాల్ సెంటర్ 14405 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా. కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎక్సైజ్, జిల్లా అధికారుల సమీక్షలో ఆమె ఈ విషయం చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు.