News December 29, 2025
మండపేట ప్రజల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం

మండపేట రాజమండ్రికి అతి సమీపంలో ఉంటుంది. కానీ జిల్లాల మార్పు సమయంలో 2003లో దీనిని బీఆర్ అంబేద్కర్ కోనసీమలో కలిపారు. అప్పటి నుంచి మండపేటను తిరిగి రాజమండ్రిలో కలపాలని ఒత్తిడి వస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజాభీష్టం పరిగణనలోకి తీసుకుంది. వారి అభిష్టానికి అనుగుణంగా మండపేటను రాజమండ్రిలో కలుపుతూ సోమవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. రెవిన్యూ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
Similar News
News January 1, 2026
తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్

AP: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుపతి గరుడ జంక్షన్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. కాగా లక్కీ డిప్ టోకెన్లు ఉన్నవారికి నేటితో దర్శనాలు ముగియనున్నాయి. రేపటి నుంచి జనవరి 8 వరకు టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు.
News January 1, 2026
మంత్రి కోమటిరెడ్డిని కలిసిన నల్గొండ కొత్త కలెక్టర్

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని నూతన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఈ రోజు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ నూతన కలెక్టర్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపి, ఆల్ ది బెస్ట్ చెప్పారు.
News January 1, 2026
HYDలో కొత్త జిల్లా.. త్వరలో ఉత్తర్వులు?

రాజధానికి 4 కమిషనరేట్‌లను తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కమిషనరేట్ల సరిహద్దులకు సమానంగా సిటీ పరిధిలోని 3 జిల్లాలను 4కు పెంచేలా CM ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. RRను ఫ్యూచర్ సిటీతో రూరల్ జిల్లాగా, అర్బన్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనుంది. HYDజిల్లాలోని కంటోన్మెంట్ ఏరియాను మల్కాజిగిరిలో కలిపి, శంషాబాద్, రాజేందర్‌నగర్‌ను HYDలో కలపనుందట.


