News March 21, 2025
మండపేట: ప్రియుడి కోసం తండ్రిని చంపిన కుమార్తె

వివాహేతర సంబంధం కోసం కుమార్తె తండ్రిని చంపేసిన ఘటన మండపేటలో జరిగింది. సీఐ సురేశ్ వివరాలు.. గ్రామానికి చెందిన రాంబాబు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో కేసునమోదు చేసి ఛేదించారు. కుమార్తె, ఆమె ప్రియుడు కలిసి హత్యచేసినట్లు తేల్చారు. కొత్తూరుకి చెందిన సురేశ్‌తో మహిళకు వివాహేతర సంబంధం ఉంది. తండ్రి మందలించడంతో ఈనెల 16న హత్యచేశారు. రామచంద్రాపురంలో నిందితులను పట్టుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.
Similar News
News March 28, 2025
అగ్నివీర్‌కు ఎంపికైన నర్సాపూర్ (జి) వాసి

నర్సాపూర్ (జి) మండలంలోని అర్లి(కే) గ్రామానికి చెందిన పోసాని -రాములు దంపతుల కుమారుడు రాజశేఖర్ ఇండియన్ ఆర్మీ అగ్ని వీర్‌కు ఎంపికయ్యాడు. తల్లి బీడీ కార్మికురాలు కాగా తండ్రి వ్యవసాయం చేస్తూ చదివించారు. చిన్ననాటి నుంచి దేశ సేవ చేయాలనే సంకల్పంతో అగ్ని వీర్‌కు ప్రయత్నించి విజయం సాధించానని యువకుడు రాజశేఖర్ తెలిపారు. ఆయన్ను గ్రామస్థులతో పాటు మండల వాసులు అభినందించారు.
News March 28, 2025
VKB: గ్రేట్.. ఆర్మీకి సెలెక్ట్

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఇప్పాయిపల్లికి చెందిన జంగం యాదయ్య కుమారుడు జంగం గణేష్, మెరుగు శ్రీశైలం కుమారుడు మెరుగు అఖిల్, ఎల్లయ్య కుమారుడు పినేమోని అభిలాశ్ ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు. వారివి పేద కుటుంబాలు కాగా పేరెంట్స్ పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఆ కష్టాలు చూస్తూ పెరిగిన ముగ్గురు యువకులు సత్తా చాటారు. అగ్నీవీరులుగా ఎంపికయ్యారు.
News March 28, 2025
SHOCKING: కూతురిని ప్రేమించాడని..

TG: రాష్ట్రంలో పరువు హత్య కలకలం రేపింది. తన కూతురిని ప్రేమించాడని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పురితోటలో సాయికుమార్ అనే యువకుడిని అమ్మాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. కూతురును ప్రేమించొద్దని హెచ్చరించినా వినలేదని నిన్న రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సాయికుమార్‌పై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.