News March 16, 2025
మండపేట: మాజీ మున్సిపల్ ఛైర్మన్ తల్లి మృతి

మండపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ మాతృమూర్తి చుండ్రు అనంతలక్ష్మి (70) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. నెల రోజులు క్రితం గుండె సంబంధిత సమస్యలు తలెత్తగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. కాగా ఆదివారం తెల్లవారుజామున 3 గంటలు సమయంలో ఆమె గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వైద్యులను పిలిపించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Similar News
News March 16, 2025
ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయండి: గొట్టిపాటి

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం శుభాకాంక్షలు చెప్పారు. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. జీవితంలో ఉన్నత చదువులకు తొలి మెట్టు పదవ తరగతి అన్నారు. ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
News March 16, 2025
ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారు: సీఎం రేవంత్

TG: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పును తమపై పెట్టి పోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని KCR దివాళా తీయించారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ పాత్ర మరువలేనిదని తెలిపారు. దొడ్డి కొమురయ్య, సర్వాయ్ పాపన్న, జయశంకర్ సర్ వంటి వాళ్లు ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులని అన్నారు.
News March 16, 2025
BRS రంగుల ప్రపంచాన్ని మాత్రమే చూపించింది: సీతక్క

సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం అన్నారు. గత 10 సంవత్సరాలలో కేవలం రంగుల ప్రపంచాన్ని మాత్రమే BRS చూపించింది.. కానీ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రజా పాలనలో సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటేనే మహిళలను అణగ తొక్కడం అని ఆరోపించారు.