News March 18, 2025

మండపేట: వైరల్‌గా మారిన పవన్ కళ్యాణ్, తోట ఫొటో

image

అసెంబ్లీ-శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ముగింపు సందర్భంగా మంగళవారం జరిగిన ఫొటో సెషన్‌లో డిప్యూటీ సి.ఎం.పవన్ కళ్యాణ్-తోట త్రిమూర్తులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సి.ఎం.పవన్ కళ్యాణ్ తోట త్రిమూర్తులును బాగున్నారా! అంటూ ఆప్యాయంగా పలకరించారు. బాగున్నాను సార్..మీరెలా ఉన్నారంటూ..ఒకరినొకరు ముచ్చటించుకున్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Similar News

News December 13, 2025

SKLM: ‘సంక్రాంతి నాటికి రోడ్లపై గుంతల్లేకుండా చేయాలి’

image

సంక్రాంతి పండగ నాటికి జిల్లాలోని రహదారులను గుంతలు లేని రోడ్లుగా మార్చాలని, మంజూరైన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్‌తో కలిసి ఆయన ఆర్అండ్‌బీ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రూ.82 కోట్ల విలువైన 28 పనులు మంజూరయ్యాయని అన్నారు.

News December 13, 2025

పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాలీలు, గుంపులపై నిషేధం: ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో పోలింగ్ కేంద్రాల పరిధిలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడకూడదని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. జిల్లాలో BNSS 163 అమలులో ఉన్నందున, విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా, డీజేల ఏర్పాటుకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

News December 13, 2025

‘రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించవలసిన బాధ్యత మనదే’

image

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ.. మార్కెటింగ్ సదుపాయాలు చూపించవలసిన బాధ్యత కమిటీ ఛైర్మన్‌లపై ఉందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్‌లు, డైరెక్టర్ల అవగాహన సదస్సు విశాఖలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 9 జిల్లాలకు చెందిన మార్కెటింగ్ ఛైర్మన్లు, డైరెక్టర్లకు మార్కెటింగ్ అంటే ఏంటో ఆమె సమగ్రంగా వివరించారు.