News January 26, 2025
మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయాలి: ASF కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4 పథకాల అమలు కోసం ప్రభుత్వ ఆదేశాలనుసారం జిల్లాలలోని అన్ని మండాలాల్లో ఒక్కొ గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో 100% అర్హులైన వారికి పథకాలు అందజేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హుల పేర్లు జాబితాలో ఉండకూడదన్నారు.
Similar News
News February 20, 2026
సంతోషీమాత వ్రతంలో పులుపు ఎందుకు నిషిద్ధం

సంతోషీ అమ్మవారు శాంతికి ప్రతీక. అయితే పులుపు, చేదు కోపాన్ని, ఆవేశాన్ని ప్రేరేపిస్తాయి. మనసును ప్రశాంతంగా ఉంచడానికి వ్రతం రోజున వీటిని దూరం పెడతారు. వీటిని నివారిస్తే భక్తులలో పట్టుదల, నిగ్రహం పెరుగుతాయి. సహనం అలవాటు అవుతుంది. అత్యాశ తగ్గి ఉన్నదాంట్లోనే సంతృప్తి చెందే గుణం అలవరుతుంది. అలాగే ఆలోచనలలో స్వచ్ఛత పెరుగుతుంది. ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా సాత్విక ప్రభావాన్ని చూపుతుంది.
News February 20, 2026
ఇండియాలో లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది: రషీద్ ఖాన్

T20 WCలో ప్రేక్షకుల మద్దతుకు అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇండియాలో మాకు లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీలో మ్యాచ్‌లకు భారీ సంఖ్యలో వచ్చారు. మేం అఫ్గాన్‌లో మా సొంత ప్రేక్షకుల ముందు ఆడుతున్నట్లు అనిపించింది. మైదానంలోనే కాదు.. ఎక్కడికెళ్లినా ప్రేమ లభించింది. మాకు మద్దతు కొనసాగించండి’ అని కెనడాతో మ్యాచ్ అనంతరం చెప్పారు.
స్కోర్లు: AFG:200/4, CAN: 118/8
News February 20, 2026
పార్వతీపురం: ‘ఉగాది నాటికి గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలి’

జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల కింద మంజూరైన గృహ నిర్మాణాలను ఉగాది పండగ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశించారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పీఎం జన్మన్, పీఎం గ్రామీన్, పీఎమ్ఏవై పథకాల కింద నిర్మిస్తున్న మొత్తం 7,187 గృహాలను గడువులోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 5,594 గృహాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


