News February 13, 2026
మండలి నుంచి YCP వాకౌట్

AP: శాసన మండలి నుంచి YCP సభ్యులు వాకౌట్ చేశారు. విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండలిలో చెప్పారు. అధికార పక్షం ఆరోపిస్తున్నట్లుగా వాకౌట్ చేయడం తమకు ఫ్యాషన్ కాదని, తమ నిరసన ద్వారా పాలనలోని లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, తద్వారా ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడమేనని వివరించారు.
Similar News
News February 13, 2026
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: ఎస్పీ నరసింహ

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ నరసింహ కోరారు. ఈనెల 16 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, గెలిచిన అభ్యర్థులు బాధ్యతగా ఉండాలని సూచించారు. విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 13, 2026
బంగ్లాదేశ్ ఎన్నికల్లో 2 బ్యాలెట్లు.. ఎందుకు?

బంగ్లాదేశ్ <<19125261>>ఎన్నికలు<<>> 2 బ్యాలెట్లతో జరిగాయి. అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఒక బ్యాలెట్ పేపర్, ‘జులై ఛార్టర్’పై రెఫరెండానికి రెండోది. 2025 అక్టోబర్‌లో 25 పార్టీలు చేసుకున్న ఒప్పందమే జులై ఛార్టర్. దీన్ని అమలు చేయాలని మెజారిటీ(65%పైగా) ప్రజలు ఓటు వేసినట్లు సమాచారం. PM పదవీ కాలంపై పరిమితులు, EC బలోపేతం, PM నుంచి ప్రెసిడెంట్‌కు అధికారాల బదిలీ వంటివి ఇందులో ఉన్నాయి. 180 పని దినాల్లో ఈ సంస్కరణలు అమలు చేయాలి.
News February 13, 2026
ఈ సెంటిమెంట్ రిపీటైతే టీ20 వరల్డ్ కప్ ఇండియాదే!

జింబాబ్వే సంచలన విజయం టీమ్ఇండియా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 1983 ODI WC, 2007 T20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు T20 వరల్డ్ కప్ మ్యాచ్‌లోనూ జింబాబ్వే ఆసీస్‌ను చిత్తు చేయడంతో ఆ అరుదైన ‘సెంటిమెంట్’ రిపీట్ అవుతుందని గూగుల్ ఇండియా విశ్లేషించింది. ఈ లక్కీ ఫ్యాక్టర్ నిజమైతే SKY సేన కప్పు గెలవడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


