News November 25, 2024
మండవల్లి: ‘ఆస్తి కోసం తమ్ముడిని హత్య చేశాడు’

మండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గన్నవరం గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో రోయ్యూరు నగేశ్ బాబు అనే నిందితుడు తన తమ్ముడు రోయ్యూరు సురేశ్, అత్త భ్రమరాంభను కత్తితో దారుణంగా హత్యచేశాడని తెలిపారు. ఈ కేసులో 48 గంటలలో నిందితులను అరెస్ట్ చేసిన కైకలూరు సీఐ రవికుమార్‌ను, ఎస్ఐను డీఎస్పీ అభినందించారు.
Similar News
News February 11, 2026
కృష్ణా: కొల్లు రవీంద్రకు బెదిరింపు లేఖ.. కార్యకర్తల ఆందోళన!

మంత్రులు కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్రలకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది. అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్రకు ముప్పు పొంచి ఉందన్న వార్తతో మచిలీపట్నం టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. సౌమ్యుడిగా పేరున్న రవీంద్రకు ఇటువంటి హెచ్చరికలు రావడంపై ఆయన అనుచరులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ భద్రత పెంచాలని కోరుతున్నారు.
News February 11, 2026
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు – కలెక్టర్ బాలాజీ

మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. నిబంధనల ప్రకారం తొలి విడతలో 308 మందికి అక్రిడిటేషన్లు మంజూరు చేశామని ఆయన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈనెల 24న జరిగే సమావేశంలో పరిశీలిస్తామన్నారు. అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.