News September 23, 2024

మంత్రాలయంలో వర్షం

image

కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. మంత్రాలయంలో కుండపోత వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఈ వర్షంపై కొందరు రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మరికొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో ఉన్న పత్తి, మిర్చి, ఉల్లి, సజ్జ తదితర పంటలు తడిసి ముద్దై నష్టపోతున్నామని చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో నేడూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News September 23, 2024

కర్నూలు డీఆర్డీఏ పీడీగా ప్రతాపరెడ్డి

image

కర్నూలు జిల్లాలో వివిధ శాఖలకు అధికారులను నియమిస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నూతన డీఆర్డీఏ పీడీగా ప్రతాపరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిగా రామనాథరెడ్డి, జిల్లా సివిల్ సప్లై మేనేజర్‌గా నాగసుధను నియమించారు. ప్రస్తుతం డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న సలాం బాషాను సంబంధిత శాఖ రాష్ట్ర కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News September 23, 2024

మహానంది ఆలయ డిప్యూటీ కమిషనర్‌గా శోభారాణి

image

మహానంది డిప్యూటీ కమిషనర్‌గా రాష్ట్ర దేవదాయశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న డీసీ.శోభారాణిని నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మహానంది ఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డికి పల్నాడు జిల్లాలోని అమరేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా బదిలీ చేశారు.

News September 22, 2024

కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసిన ఎంపీ శబరి

image

ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌ను ఆదివారం నంద్యాల MP, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డా.బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి శేషవస్త్రం, స్వామి, అమ్మవార్ల ఫొటో, అభిషేకం లడ్డూను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ దస్త్రాలు క్లియర్ చేసేందుకు సహకరించాలని కోరారు.