News April 6, 2025
మంత్రిఅచ్చెన్నకు కాంట్రాక్ట్ ఉద్యోగుల వినతి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ కాంట్రాక్ట్ ఉద్యోగులు శనివారం రాత్రి నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో కలిశారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. సమగ్ర శిక్ష అభియాన్‌లో 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కేవలం రూ. 17 వేలను మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలకు గౌరవ వేతనం చాలడం లేదని వినతి పత్రంలో పేర్కొన్నారు.
Similar News
News April 6, 2025
త్రిపురాన విజయ్‌తో ముచ్చటించిన ధోనీ

టెక్కలికి చెందిన యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ త్రిపురాన విజయ్‌తో ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్లేయర్ ధోనీ ముచ్చటించారు. చపాక్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ధోనీని విజయ్ కలిశారు. ఈ సందర్భంగా మొదటిసారి ఐపీఎల్‌కు ఎంపికైన విజయ్‌ను ధోనీ అభినందించారు.
News April 6, 2025
సోంపేట మండల యువకుడికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

ఇటీవల విడుదల అయిన SSC CGL ఫలితాల్లో సోంపేట మండలం బారువకొత్తూరులోని మత్స్యకార కుటుంబానికి చెందిన గురుమూర్తి సత్తా చాటారు. ఆల్ ఇండియా స్థాయిలో 374వ ర్యాంక్ సాధించి కేంద్రం ప్రభుత్వంలో ఉద్యోగం సాధించారు. కస్టమ్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పోస్టింగ్ వచ్చినట్లు సన్నిహితులు తెలిపారు. దీంతో అతని తల్లిదండ్రులు శకుంతల, మోహనరావు ఆనందం వ్యక్తం చేశారు. అతనికి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
News April 6, 2025
వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాకు వర్ష సూచన, పిడుగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారుల సెలవులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ రద్దు చేశారు. వచ్చే 48 గంటల పాటు కలెక్టరేట్‌లో 08942-20557 ఫోన్ నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోంపేట మండలంలో అధిక వర్షపాతం పడే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించారు.