News June 12, 2024
మంత్రిగా గొట్టిపాటి ప్రమాణ స్వీకారం

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ బుధవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘ గొట్టిపాటి రవి కుమార్ అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వహిస్తాను’ అంటూ ప్రమాణం చేశారు.
Similar News
News January 2, 2026
రేపే TDP ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడి ప్రమాణం

టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఆయన శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారని నాయకులు తెలిపారు. ఒంగోలు పట్టణంలోని SGVS కళ్యాణ మండపంలో బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.
News January 2, 2026
BREAKING మార్కాపురం జిల్లాలో మర్డర్!

మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం బీసీ కాలనీలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న జయంపు కృష్ణయ్య(55) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 2, 2026
ఆదర్శంగా ప్రకాశం కలెక్టర్..!

ప్రకాశం కలెక్టర్ రాజాబాబు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ బొకేలు ఎవరూ తీసుకు రావద్దని, కేవలం విద్యార్థులకు ఉపయోగపడే మెటీరియల్ తీసుకురావాలని కలెక్టర్ ముందుగా సూచించారు. అధికారులు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను అందజేశారు. పెద్ద మొత్తంలో వచ్చిన పుస్తకాలను త్వరలో విద్యార్థులకు అందించనున్నారు.


