News June 12, 2024
మంత్రిగా డోలా ప్రమాణ స్వీకారం

కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి బుధవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘ డోలా బాల వీరాంజనేయస్వామి అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వహిస్తాను’ అంటూ ప్రమాణం చేశారు.
Similar News
News December 23, 2025
ప్రకాశం జిల్లాలో యూరియాకై ప్రణాళిక సిద్ధం

ప్రకాశం జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 34878 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లాకు మొత్తం 23115 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికీ 31872 పెళ్లి టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందని డిసెంబర్‌కు 350 మెట్రిక్ టన్నులు రానుందన్నారు.
News December 23, 2025
ప్రకాశం: బిడ్డ మోసానికి.. RDO న్యాయం

కన్న బిడ్డ మోసం చేస్తే.. ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న ఆ తల్లికి న్యాయం చేశారు. ముండ్లమూరు మండలం కొమ్మవరానికి చెందిన రమాదేవికి ఒక కుమారుడు ఉన్నారు. కాగా రమాదేవి పేరుమీద ఉన్న 1.96 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమె మృతి చెందినట్లు తప్పుడు సర్టిఫికెట్ సృష్టించి వేరొకరికి ఆ భూమి విక్రయించాడు. రమాదేవి దీనిపై RDOకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఆర్డీవో విక్రయాన్ని రద్దుచేసి సహకరించిన అధికారులపై చర్యలకు ఆదేశించారు.
News December 23, 2025
మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలి: కలెక్టర్

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్న భోజనం అమలుకు సంబంధించి జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజాబాబు అధ్యక్షత నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం నూరు శాతం అమలుజరగడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని, నాణ్యత లోపాలు లేకుండా చూడాలన్నారు.


