News December 29, 2025
మంత్రితో సినీ దర్శకుల భేటీ.. పరిశ్రమ అభివృద్ధిపై చర్చలు!

విజయవాడలో పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్(TFDA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో అసోసియేషన్ బలోపేతం, సినీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పరిశ్రమ పురోభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధుల బృందం పాల్గొన్నారు.
Similar News
News January 6, 2026
పోలీసుల ‘వాట్సాప్’ నంబర్ ఇదే.. సేవ్ చేసుకోండి!

ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండానే సేవలు పొందేలా ప్రభుత్వం ‘వాట్సాప్ గవర్నెన్స్’ను అందుబాటులోకి తెచ్చిందని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. ప్రజలు తమ మొబైల్స్‌లో 9552300009 నంబరును సేవ్ చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ఈ-చలాన్ చెల్లింపు, ఎఫ్.ఐ.ఆర్ (FIR) కాపీలు, కేసు దర్యాప్తు స్థితిగతులను సులభంగా తెలుసుకోవచ్చన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని ప్రజలు సమయాన్ని ఆదా చేసుకోవాలని ఎస్పీ కోరారు.
News January 5, 2026
తూ.గో: పోలీసు పీజీఆర్ఎస్‌కు 26 ఆర్జీలు

తూ.గో. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కు 26 ఆర్జీలు వచ్చినట్లు ఎస్పీ డి.నరసింహకిశోర్ తెలిపారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించరాదని స్పష్టం చేశారు.
News January 5, 2026
RJY: నేడు కలెక్టరేట్‌లో ‘రెవెన్యూ క్లినిక్’

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్‌తో పాటు ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని తహశీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. మండల స్థాయిలో డిప్యూటీ తహశీల్దార్లు PGRS నిర్వహిస్తారని స్పష్టం చేశారు. భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.


