News February 6, 2025

మంత్రి అచ్చెన్నాయుడికి 17వ ర్యాంక్

image

సీఎం చంద్రబాబు మంత్రులకు గురువారం ర్యాంకులు ప్రకటించారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడికి 17వ ర్యాంక్ వచ్చింది. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం మంత్రికి సూచించారు.

Similar News

News February 15, 2026

శ్రీకాకుళం: ఉద్యోగం పేరిట మహిళకు మోసం

image

ఉద్యోగాల పేరుతో తనతో పాటు మరికొందరు మోసపోయినట్లు శ్రీకాకుళంలోని బొందిలిపురానికి చెందిన ఎం. విజయలక్ష్మి శనివారం 2టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గోపాల్ రెడ్డి, నాగేంద్ర రెడ్డి ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 15 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వద్ద మరిన్ని వివరాలు సేకరించి టూ టౌన్ సీఐ ఈశ్వర్ రావు కేసు నమోదు చేశారు.

News February 15, 2026

పలాస కళాకారుడి అద్భుతం.. !

image

మహాశివరాత్రి పురస్కరించుకొని పలాసకు చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేశ్ ఆచారి తన అద్భుత కళాఖండంతో భక్తిని చాటుకున్నారు. పెన్సిల్ మొనపై శివలింగం, ఓంకారాన్ని అత్యంత సుందరంగా చెక్కి అందరినీ అబ్బురపరిచారు. సుమారు 5 గంటల శ్రమతో రూపొందించిన ఈ సూక్ష్మ శిల్పం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ రథసప్తమి లోగో, అతిచిన్న ప్రపంచ కప్ వంటి ఆకృతులతో రమేశ్ తన ప్రతిభను నిరూపించుకున్నారు.

News February 14, 2026

మూడు పద్దులు.. మూడు రంగులు

image

గ్రే, బ్రౌన్, బ్లూ.. ఈ రంగులు ఏపీ బడ్జెట్ వేళ తారస పడుతున్నాయి. ఈ రంగుల బ్యాగుల్లో బడ్జెట్ ప్రతులను ఉంచి అసెంబ్లీకి తీసుకొస్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూజ చేసిన తర్వాత వాటిని కేబినెట్‌లో ఆమోదించే నిమిత్తం సీఎం చంద్రబాబు, dy.సీఎం పవన్‌కు అందజేశారు. ప్రభుత్వం కొలువైన తర్వాత తొలుత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు గ్రే కలర్ బ్యాగు, తర్వాత బ్రౌన్, ఇవాళ బడ్జెట్ ప్రతులను బ్లూ కలర్ బ్యాగులో తెచ్చారు.