News October 8, 2025

మంత్రి అచ్చెన్నాయుడుపై జగన్‌కు ఫిర్యాదు

image

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్ పేరాడ తిలక్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. టెక్కలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం, మంత్రి అచ్చెన్నాయుడు వల్ల వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు అన్యాయాలు జరుగుతున్నాయన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లు తిలక్ తెలిపారు.

Similar News

News October 8, 2025

శ్రీకాకుళం: ‘మరో మూడు గంటలు..సురక్షిత ప్రదేశాల్లో ఉండండి’

image

శ్రీకాకుళం జిల్లాలోని మరో మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చిరికలు జారీ చేసింది. ఈ వానలు ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి, శ్రీకాకుళం, నరసన్నపేట పరిసర ప్రాంతాల్లో పడతాయని చెప్పారు. పిడుగులతో పాటు 40-50 కి.మీ ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలెవ్వరూ బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండవద్దని కలెక్టరేట్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.

News October 8, 2025

పొందూరు : రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

పొందూరు మండలం తుంగపేట సమీపంలో రైల్వే గేటు వద్ద గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్పీ హెచ్సీ మధుసూదనరావు బుధవారం తెలిపారు. మృతుని వయస్సు 35 సంవత్సరాలు ఉండి గడుల కలర్ చొక్కా ధరించినట్లు తెలిపారు. రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News October 8, 2025

కొత్తూరు: కేజీబీవీ ప్రిన్సిపల్, అకౌంటెంట్‌లపై వేటు

image

కొత్తూరు కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ప్రిన్సిపల్ రాధిక, అకౌంటెంట్ శ్రీదేవిలను విధుల నుంచి తొలగిస్తూ సమగ్ర శిక్ష ఏపీసీ ఎస్ శశిభూషణ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీని కొత్తూరు తహశీల్దార్ బాలకృష్ణ ఇటీవల ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో రికార్డులో 248 కిలోల బియ్యం మిగిలి ఉన్నట్లు నమోదు చేశారు. వాస్తవానికి 1,400 కిలోల బియ్యం మిగిలి ఉన్నాయి. దీంతో వారిపై వేటు పడింది.