News January 10, 2026
మంత్రి అనిత- సీనియర్ల మధ్య గ్యాప్?

అనకాపల్లి జిల్లాలో సీనియర్ MLAలు, మాజీ మంత్రులతో హోంమంత్రి అనిత అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆమె కార్యక్రమాల్లో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పరమైన పిలుపులు తప్ప ఆత్మీయ ఆహ్వానాలు లేవని కూటమి వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజాగా అడ్డురోడ్డు ఆర్డీవో కార్యాలయ ప్రారంభోత్సవానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఈ అసంతృప్తికి నిదర్శనమంటున్నారు.
Similar News
News February 7, 2026
సాగు భూములకే రైతు భరోసా!

TG: రైతు భరోసా(₹6,000) కేవలం సాగులో ఉన్న భూములకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వానాకాలం సీజన్‌లో సాగు వివరాల ఆధారంగా అర్హులైన రైతులకే నగదు జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అగ్రికల్చర్ వర్సిటీ శాటిలైట్ మ్యాపింగ్ సర్వే పూర్తి చేయగా 1.53 కోట్ల ఎకరాల సాగుభూమిలో 20 లక్షల ఎకరాలు పంట వేయకుండా ఉన్నట్లు తేలింది. కాగా మున్సిపోల్ తర్వాత రైతు భరోసా ఇస్తామని CM ప్రకటించారు.
News February 7, 2026
MBNR: నేడు పరీక్ష.. 4,592 మంది పోటీ

జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 9, 11 తరగతిలో మిగులలు సీట్ల భర్తీకి నేడు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. 11వ తరగతికి ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, 9వ తరగతికి ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాల్లో 4,592 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు వట్టెం ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు.
News February 7, 2026
రేపు సూర్యుడిని ఎందుకు పూజించాలి?

రేపు భాను సప్తమి. దీన్నే ‘ఆరోగ్య సప్తమి’ అని కూడా అంటారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోయి, శరీరం శుద్ధి అవుతుందని నమ్ముతారు. సూర్యరశ్మిలోని శక్తి మన శారీరక, మానసిక అనారోగ్యాలను నయం చేస్తుంది. నిష్ఠతో ఉపవాసం ఉండి సూర్యుడిని పూజించే వారికి గత జన్మల పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా, ఏడాది పొడవునా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా దైవిక రక్షణ లభిస్తుంది.


