News November 6, 2025

మంత్రి ఆమోదం కోసం మైక్రో బ్రూవరీల ఎదురుచూపు

image

TG: HYD కోర్ అర్బన్, ఇతర 6 కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ ఇంతకు ముందు టెండర్లు పిలిచింది. SEP 25 గడువు నాటికి ఎక్సైజ్ శాఖకు 127 మంది బిడ్లు దాఖలు చేశారు. ఆ వివరాలు తనకు పంపాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించడంతో అధికారులు ఆయనకు సమర్పించారు. టెండర్లు ఖరారు చేయడానికి మంత్రి ఆమోదం కోసం అప్పటినుంచి ఎదురుచూస్తున్నారు. మంత్రి ఓకే అనేవరకు టెండర్ల ఖరారులో జాప్యం తప్పేలా లేదు.

Similar News

News November 6, 2025

ఎస్‌బీఐ PO ఫలితాలు విడుదల

image

SBIలో 541 ప్రొబెషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు రిలీజయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను <>https://sbi.bank.in/<<>>లో అందుబాటులో ఉంచారు. వీరికి త్వరలో సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు. కాగా ఈ ఉద్యోగాలకు ఆగస్టు 2, 4,5 తేదీల్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ 13న మెయిన్స్ ఎగ్జామ్ పూర్తయిన విషయం తెలిసిందే.

News November 6, 2025

విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చడానికి బాటలు వేస్తాం: రామ్మోహన్

image

AP: ప్రపంచంలో రోజూ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని, దీన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. <<18216721>>సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్<<>> కోసం ఢిల్లీలో పర్యటిస్తోన్న స్టూడెంట్లతో ఆయన ముచ్చటించారు. విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చడానికి బాటలు వేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ కావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News November 6, 2025

మినుము పంటలో విత్తన శుద్ధితో అధిక దిగుబడి

image

మినుము పంటలో తెగుళ్ల కట్టడికి విత్తనశుద్ధి కీలకం. దీని కోసం కిలో విత్తనానికి 2.5 గ్రాముల కాప్టాన్ (లేదా) థైరాన్ (లేదా) మాంకోజెబ్‌లతో విత్తనశుద్ధి చేయాలి. తర్వాత కిలో విత్తనానికి 5ml ఇమిడాక్లోప్రిడ్ 600 FS మందును కలిపి నీడలో ఆరనివ్వాలి. విత్తడానికి గంట ముందుగా కిలో విత్తనానికి 20గ్రా రైజోబియం కల్చరును కలిపినట్లైతే, నత్రజని బాగా అందుబాటులో ఉండటం వల్ల, అధిక పంట దిగుబడిని పొందవచ్చు.