News March 15, 2025
మంత్రి ఉత్తమ్‌తో మంత్రి తుమ్మల భేటీ

రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్ పురోగతి, భూసేకరణ, ఖర్చు, నాణ్యత, భవిష్యత్ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం సత్తుపల్లి ట్రంక్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మిగిలిన పనుల పురోగతిని సమీక్షిస్తూ ప్రాజెక్ట్ నాణ్యత, ఖర్చుల సమీక్ష, పనివేగంపై తుమ్మల విశ్లేషించారు.
Similar News
News March 15, 2025
KMM: ఏడాదిలో 16మంది ఏసీబీకి చిక్కారు..!

ఉమ్మడి ఖమ్మంలో అవినీతి అధికారులు పెరిగిపోతున్నారు. ఏడాదిలో దాదాపు 16 మంది అధికారులు ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా, ఆఖరికి రూ.1500కు కూడా కక్కుర్తి పడి ఏసీబీకి చిక్కుతున్నారు. ఇంకా గుట్టుచప్పుడు కాకుండా ఎంత నడుస్తోందోనని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం విషయంలో ఇబ్బంది పెడితే తమను సంప్రదించాలని ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్ సూచిస్తున్నారు.
News March 15, 2025
ఎర్రుపాలెం: అప్పులు బాధ తాళలేక రైతు ఆత్మహత్య

అప్పులు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎర్రుపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మొలుగుమాడుకి చెందిన తోట వెంకటేశ్వరరావు అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల పొలంతో పాటు మరో 5ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేశాడు. పంట సరిగా పండకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 15, 2025
మెగాస్టార్ చిరంజీవికి అవార్డు హర్షం వ్యక్తం చేసిన ఎంపీ

మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్డమ్ ప్రతిష్ఠాత్మక “లైఫ్ టైం అచీవ్ మెంట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్”పురస్కారాన్ని ప్రకటించడం పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తంచేశారు. సినిమా హీరోగా లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని మెగాస్టార్ గా కీర్తించబడుతున్న చిరంజీవి బ్లడ్,ఐ బ్యాంకులు నెలకొల్పి విశేష సేవలందిస్తున్నారని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.