News October 16, 2024

మంత్రి, ఎంపీల ఫొటో మార్ఫింగ్.. నిజామాబాద్ వాసి అరెస్ట్

image

మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు ఫొటో మార్ఫింగ్ కేసులో నిజామాబాద్ జిల్లా వాసి అరెస్ట్ అయ్యారు. ఎంపీ రఘునందన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ దేవన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే జగిత్యాల జిల్లాకు చెందిన ఒకరిని అరెస్ట్ చేశారు.

Similar News

News February 10, 2026

NZB: సాయంత్రం 5 వరకు లైన్‌లో ఉన్నవారికి టోకెన్‌లు

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రేపు సాయంత్రం 5 గంటల వరకు లైన్‌లో ఉన్న ఓటర్లకు టోకెన్‌లు అందజేస్తామని NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సీపీ సాయి చైతన్య, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.

News February 10, 2026

NZB: రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్రగాయాలు

image

రెంజల్ మండలం సాఠాపూర్‌లో సామియ ఫంక్షన్ హాల్ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. సాఠాపూర్ నుంచి బోధన్ వైపు వస్తున్న బంతి అనే వ్యక్తి బైక్.. దేవయ్య, నాగేందర్ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో గాయపడిన వారికి 108 సిబ్బంది గంగామణి, సతీశ్ ప్రథమచికిత్స చేసి, అనంతరం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News February 10, 2026

NZB: ఆటోల్లో ఎక్కించుకుని నగదు, ఫోన్లు దొంగతనం

image

నిజామాబాద్‌లో ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించుకొని వారి జేబులు కట్ చేసి నగదు, మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. షేక్ సలీమ్, షేక్ సద్దాం, షేక్ ఇమ్రాన్, షేక్ నయీం, సయ్యద్ వసీం పాషా, సయ్యద్ వహాబ్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.