News September 20, 2024
మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేత
రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో సింథటిక్ శాలువాలు వాడకుండా చేనేత శాలువాలు, చేనేత బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. అనంతరం దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రి కొండా సురేఖతో నేతలు చర్చించారు.
Similar News
News November 25, 2024
వరంగల్ మార్కెట్లో చిరు ధాన్యాల ధరలు ఇలా
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు (బిల్టీ) క్వింటాకి రూ.2,475 పలికింది. అలాగే సూక పల్లికాయ రూ.6,000 పలకగా.. పచ్చి పల్లికాయ రూ.5,570 పలికింది. తేజా రకం కొత్తమిర్చి క్వింటాకు రూ.15,021 ధర పలికింది. అయితే గత వారంతో పోలిస్తే నేడు పల్లికాయ ధరలు పెరిగాయి.
News November 25, 2024
KU డిగ్రీ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. బీఏ, బీకాం, బీబీఏ, బీఏసీ తదితర కోర్సుల మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26న ఉండగా వాటిని డిసెంబర్ 27కు రీ షెడ్యూల్ చేశారు. మూడో సెమిస్టర్ ఈ నెల 27న ఉండగా డిసెంబర్ 28కి మార్చారు. నవంబర్ 28న ఉండే పరీక్షను డిసెంబర్ 30న నిర్వహించనున్నట్లు కేయూ అధికారులు తెలిపారు. మిగతావి యథావిధిగా కొనసాగుతాయన్నారు.
News November 25, 2024
నర్సంపేట: 29న పారా మెడికల్ కోర్సులకు ఇంటర్వ్యూలు
నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధంగా ఈ ఏడాది ప్రారంభం కానున్న పారా మెడికల్ కళాశాలలో వివిధ కోర్సుల ప్రవేశానికి ఈ నెల 29న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు. నర్సంపేట ప్రభుత్వ పారామెడికల్ కళాశాలలో D.ECG, D.Dialysis కోర్సులు ఉన్నట్లు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు ఫారం, అభ్యర్థి ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.