News February 14, 2025
మంత్రి గన్‌మెన్ వెంకటరమణను సస్పెండ్ చేసిన ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739511455066_1100-normal-WIFI.webp)
రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న జి.వెంకటరమణను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సస్పెండ్ చేశారు. వెంకటరమణ ఇటీవల సాలూరు నుంచి విజయనగరం వస్తుండగా బుల్లెట్ మ్యాగ్జైన్‌తో ఉన్న బ్యాగ్ మిస్ అయ్యింది. దీంతో ఆయన విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News February 16, 2025
వారి లైసెన్సులను రద్దు చేస్తాం: VZM కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739626601835_52016869-normal-WIFI.webp)
ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని, ఇక పై నిబంధనలు పాటించని వారి లైసెన్స్‌ను రద్దు చేస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వేగం కన్నా సురక్షితంగా చేరడం ముఖ్యమని, ప్రతి వాహన దారుడు తాను సురక్షితంగా ఉంటూ పక్క వారిని కూడా సురక్షితంగా ఉంచాలని అన్నారు.
News February 15, 2025
వారిని కచ్చితంగా శిక్షించాలి: SP వకుల్ జిందాల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739621621677_51928805-normal-WIFI.webp)
NDPS((నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) కేసుల్లో నిందితులు కచ్చితంగా శిక్షించాలిలని SP వకుల్ జిందాల్ అన్నారు. విశాఖ డిఐజి గోపీనాథ్ జెట్టి ఆదేశాలతో దర్యాప్తులో మెలకువలు నేర్పేందుకు శనివారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. NDPS చట్టం చాలా కఠినమైనదని, చట్టంలో పొందుపరిచిన విధివిధానాలను దర్యాప్తు అధికారులు పాటిస్తే నిందితులు తప్పనిసరిగా శిక్షింపబడతారన్నారు.
News February 15, 2025
విశాఖ: కామాంధుడి కోరికలకు వివాహిత బలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739596120697_1100-normal-WIFI.webp)
గోపాలపట్నంలో శుక్రవారం జరిగిన వివాహిత ఆత్మహత్య ఘటన కలిచివేసింది. తన వికృత చేష్టలతో భార్యను దారుణంగా హింసించిన భర్త.. చివరకు ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. పోర్న్ వీడియోలకు బానిసై భార్యతో మానవ మృగంలా ప్రవర్తించాడు. లైంగిక వాంఛకు ప్రేరేపించే మాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. మానసికంగా ఎంతో వేదనను అనుభవించిన ఆమె చివరకు ఉరి వేసుకుని తన జీవితానికి ముగింపు పలికింది