News June 12, 2024
మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఏ శాఖ..?

రాష్ట్రమంత్రి గుమ్మిడి సంధ్యారాణికి కేటాయించే శాఖపై ఆసక్తి నెలకొంది. అధికార పక్షంతోపాటు ప్రతిపక్ష నేతలు సైతం ఆమెకు కేటాయించే శాఖపై చర్చించుకుంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కేటాయించే అవకాశాలున్నాయని పలువురు భావిస్తుండగా.. ఆమె టీచర్‌గా పనిచేసిన కారణంగా విద్యాశాఖ సైతం అప్పగించే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఆమెకు ఏ శాఖ కేటాయిస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.
Similar News
News September 15, 2025
VZM: నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
News September 14, 2025
రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఈ నెల 15న సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
News September 14, 2025
17న జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు

ఈనెల 17న రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు జిల్లా బంద్ చేపడతామని కార్మిక సంఘ నాయకులు తెలిపారు. శనివారం చీపురుపల్లిలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఫ్రీ బస్సుతో రోడ్డున పడ్డ ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.25 వేలు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీవో వేధింపులు, ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదం, రాజాం డ్రైవర్లు పాల్గొన్నారు.