News February 28, 2025
మంత్రి తుమ్మల అనుచరుడు గాదె సత్యం మృతి

సత్తుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు గాదె సత్యనారాయణ (76) ఊపిరితిత్తుల వ్యాధితో శుక్రవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాలలో సేవలందించారు. ఆయన మృతిపట్ల మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆయా పార్టీల నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News February 28, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

> ఖమ్మం:ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సీపీ సన్మానం> సత్తుపల్లి: కార్యకర్తలపై ఎమ్మెల్యే అసహనం> ఖమ్మం: రూ.3 లక్షల మిర్చి పంట చోరీ> బోనకల్: 2 కార్లు డీ.. ఇద్దరికి గాయాలు> ముదిగొండ: బిల్డింగ్ పై నుంచి పడి కార్మికుడి మృతి> తిరుమలాయపాలెం:యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు >సత్తుపల్లి: మంత్రి తుమ్మల అనుచరుడు గాదె సత్యం మృతి
News February 28, 2025
భద్రాచలం గోదావరిలో ఇద్దరు యువకులు మృతి

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అయితే గల్లంతయిన ఇద్దరు యువకులు మృతి చెందారు. వారి మృతదేహాలను గజఈతగాళ్లు వెలికి తీశారు. మృతులు పవన్(20), హరి ప్రసాద్(18) గా పోలీసులు గుర్తించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 28, 2025
ఖమ్మం: బర్డ్ ఫ్లూ భయం.. చికెన్ షాపులు వెలవెల!

బర్డ్ ఫ్లూ వైరస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ షాపుల నిర్వాహకులపై గుదిబండలా మారింది. కేజీ ధర రూ. 180 ఉన్నా వైరస్ భయంతో చికెన్ కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. రూ. 800 ఉన్న మటన్ రూ. 1000, చేపలు రకాన్ని బట్టి కేజీకి రూ. 50-100 ఎక్కువ పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలతో మాంసం ప్రియులు నోటికి తాళం వేస్తున్నారు.