News December 15, 2025
మంత్రి తుమ్మల ఇలాకాలో.. ఎవరు గెలిచారంటే..!

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లి సర్పంచ్ ఫలితాలు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మెచ్చు ఈదప్ప తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై 350 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ గెలుపుతో సొంత గ్రామంలో తుమ్మల, జారే తమ పట్టు నిలుపుకున్నారు.
Similar News
News December 18, 2025
నిర్మల్: ఒక్క ఓటుతో వరించిన విజయం

భైంసా మండలంలోని లింగా గ్రామ సర్పంచ్‌గా సుష్మారాణి ఒక్క ఓటుతో విజయం సాధించారు. గ్రామంలో 293 ఓట్లు పొలయ్యాయి. సుష్మరాణికి 143, సమీప ప్రత్యర్థి స్వాతికి 142, రాధికకు 4 ఓట్లు, మరో 4 ఓట్లు నోటాకు వేశారు. చివరి దాకా ఉత్కంఠ నెలకొనగా ఒక్క ఓటుతో సుష్మరాణి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. ఇక్కడ రీకౌంటింగ్ జరిగినా సుష్మరాణే గెలిచారు.
News December 18, 2025
పరిగి: తీవ్ర ఉద్రిక్తతల మధ్య మాదారంలో బోయిని రాములు విజయం

తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన వికారాబాద్ జిల్లా పరిగి మండలం<<18588851>> మాదారం సర్పంచ్<<>> ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బోయిని రాములు విజయం సాధించారు. బుధవారం ఉదయం జరిగిన దాడిలో రాములుకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను పరిగి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన గ్రామంలో లేక పోవడంతో పార్టీ నాయకులు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.
News December 18, 2025
వరంగల్: ఆ ఇద్దరు మళ్లొచ్చారోచ్!

ఒకాయన చేసిన తుపాకీ సెటిల్మెంట్‌కి ఆమె మంత్రి పదవికే ఎసరు తెచ్చే పరిస్థితి ఏర్పడింది. మరొక అతను ఇసుక లారీల కోసం చేసిన కాల్స్‌తో మరో మంత్రికి మచ్చ తెచ్చింది. మంత్రుల ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఈ ఇద్దరు చేసిన గండాల నుంచి, మంత్రులు ఇలా బయటపడ్డారో లేదో మళ్లీ వచ్చి వాలిపోయారు. మంత్రుల దగ్గర తమ తడాఖా చూపెడుతున్నారు. అయితే, పోయిందనుకున్న గండం మళ్లీ రావడంతో ఉమ్మడి వరంగల్ నేతలు, అధికారులు ఇబ్బంది పడుతున్నారు.


