News April 17, 2025
మంత్రి పొన్నం అపాయింట్‌మెంట్ కావాలా!

మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆయనను కాలవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ‘మంత్రి అపాయింట్ మెంట్ కావాలంటే 9959226407 నంబర్‌కు మెసేజ్ చేయాలని’ ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన మంచి ఫలితాలను ఇస్తుందని మంత్రి కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.
Similar News
News December 23, 2025
శుభ సమయం (23-12-2025) మంగళవారం

➤ తిథి: తదియ ఉ.10.27 వరకు
➤ నక్షత్రం: శ్రవణం తె.5.52 వరకు
➤ శుభ సమయాలు: ఏమీ లేవు
➤ రాహుకాలం: మ.3 నుంచి సా.4.30 వరకు
➤ యమగండం: ఉ.9 నుంచి 10.30 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు, పున: రా.10.48 నుంచి 11.36 వరకు
➤ వర్జ్యం: ఉ.8.54 నుంచి రా.10.36 వరకు
➤ అమృత ఘడియలు: సా.6.36 నుంచి రా.8.16 వరకు
News December 23, 2025
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి: కలెక్టర్

ప్రతి రోజు 50 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ హాల్ నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఉపాధి హామీ పథకం, ఏపీఎంఐపీ, హౌసింగ్ తదితర అంశాలపై ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం కింద రోజుకు 28 వేల మంది కూలీలు పనులకు వస్తున్నారన్నారు. ఆ సంఖ్యను మరింత పెంచాలని సూచించారు.
News December 23, 2025
VZM: పది పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి

పది పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 297 పాఠశాలల్లో 16,240 మంది విద్యార్థులు 10 పరీక్షలకు హాజరవుతారని, వారందరూ ఉత్తీర్ణత సాధించేలా అధికారులు కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ చూపాలన్నారు.


