News February 6, 2025
మంత్రి ఫరూక్‌కు 1st ర్యాంక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738842381107_727-normal-WIFI.webp)
సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో నంద్యాల జిల్లా మంత్రులు ఫరూక్ 1, బీసీ జనార్దన్ రెడ్డి 9వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.
Similar News
News February 6, 2025
ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738849866688_893-normal-WIFI.webp)
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని మోదీ ఈనెల 24న విడుదల చేయనున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆరోజున బిహార్‌లో పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అదే సమయంలో పీఎం కిసాన్ నిధులను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ పథకం కింద కేంద్రం ఒక్కో రైతుకు ఏడాదికి 3 విడతల్లో ₹2వేల చొప్పున మొత్తం ₹6వేలు అందిస్తోంది. e-KYC పూర్తి చేసిన వారికే ఈ డబ్బులు జమవుతాయి.
News February 6, 2025
చిట్యాల వద్ద రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738852434832_729-normal-WIFI.webp)
చిట్యాల మండలం వెలిమినేడు శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కర్ణాటక రాయచూర్ నుంచి విజయవాడకు హినప్ప రాజు (22) తన స్నేహితులతో వెళ్తున్నాడు. బైక్ అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో హినప్ప రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 6, 2025
VZM: ‘క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738841418666_52016869-normal-WIFI.webp)
క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారిణి జీవన రాణి సూచించారు. వైద్య శాఖ కార్యాలయంలో జిల్లాలో పీహెచ్సీ, సీహెచ్సీ వైద్యులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాతృ సేవలు, జేఎస్ వై, పీఎం మాతృ సురక్ష అభియాన్, తదితర కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శత శాతం ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు.