News August 27, 2024
‘మంత్రి మనోహర్ రేషన్ మాఫియాకు వణుకు పుట్టించారు’

పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రేషన్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. తెనాలి జనసేన కార్యాలయంలో సోమవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కాకినాడ పోర్టు సాక్షిగా మంత్రి మాఫియాకి వణుకు పుట్టించారు అని అన్నారు.
Similar News
News March 3, 2026
RRR కస్టడీ హింసల కేసులో ట్విస్ట్

AP Dy స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టడీ హింసల కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న IPS అధికారి సునీల్ నాయక్‌కు AP హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు దర్యాప్తు అధికారికి ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. విచారణకు సహకరించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. కేసులో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
News March 2, 2026
దుగ్గిరాలలో రోడ్డు ప్రమాదం.. చెట్టు ఎక్కిన బైక్!

బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు గాయపడగా, వారి వాహనం వింతగా చెట్టుపైకి దూసుకెళ్లిన ఘటన దుగ్గిరాల లాకు వద్ద జరిగింది. చినరావూరుకు చెందిన కిషోర్, విజయ్ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదవశాత్తూ పడిపోగా, బైక్ మాత్రం చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయింది. గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News March 2, 2026
తుళ్లూరులో కొడుకుని పట్టించిన పేరెంట్స్..!

తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాల్లో ఆవులను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీకాంత్ మండల వ్యాప్తంగా సుమారు 25 ఆవులకు పైగా అపహరించినట్లు పలువురు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, స్టేషన్ వెనకవైపు ఉన్న గోడ దూకి పారిపోయాడు. తిరిగి కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పజెప్పగా సిబ్బంది పేరెంట్స్‌ను అభినందించారు.


