News December 27, 2025
మంత్రి రవీంద్ర పేరిట మోసం.. రూ.1.15 కోట్లు టోకరా.!

మంత్రి కొల్లు రవీంద్రకు ఏజెంట్లుగా పనిచేస్తున్నాం.. లిక్కర్ మార్ట్ మంజూరు చేయిస్తామంటూ రూ.1.15 కోట్లు వసూలు చేసిన వంకాయలపాటి రాంబాబు, సాయికిరణ్‌పై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. SVN కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు నుంచి నిందితులు డబ్బులు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా లిక్కర్ మార్ట్ మంజూరు కాలేదు. బాధితుడు మంత్రిని కలవగా వారు తనకు తెలియదని చెప్పడంతో మోసపోయానని బాధితుడు ఫిర్యాదు చేశాడు.
Similar News
News January 3, 2026
ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి: అదనపు కలెక్టర్

రానున్న మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై అదనపు కలెక్టర్ శ్రీజ జిల్లాలోని అందరు మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News January 3, 2026
OTTలోకి ‘అఖండ-2’.. ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా పలు వాయిదాల తర్వాత డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా రూ.120కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో సంయుక్తా మేనన్, ఆది పినిశెట్టి తదితరులు నటించగా తమన్ సంగీతం అందించారు.
News January 3, 2026
పొగ మంచు ఎఫెక్ట్.. కోనసీమను తలపిస్తున్న వేములవాడ

దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వేములవాడ పట్టణం కోనసీమ అందాలను తలపిస్తోంది. తిప్పాపూర్ వేములవాడ మధ్యన ఉన్న బ్రిడ్జి, తిప్పాపూర్ లోని ప్రధాన బస్టాండ్ తదితర ప్రాంతాలు పొగమంచులో లీలగా మాత్రమే కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుండి ఉదయం వరకు ఇదే పరిస్థితి ఉండడంతో వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఇబ్బంది పడగా, మార్నింగ్ వాక్ కు వెళ్లినవారు ఈ ఆహ్లాద దృశ్యంతో ఆనంద పరవశులయ్యారు.


