News December 29, 2025

మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి చంద్రబాబు ఫోన్

image

AP: <<18702293>>రాయచోటి<<>>ని జిల్లా కేంద్రంగా తొలగించడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై రాంప్రసాద్‌రెడ్డితో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ‘విధిలేని పరిస్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మీరు పోరాడుతున్నారు. ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేసే వీలులేకే ఈ పరిస్థితి వచ్చింది’ అని తెలిపారు. రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు CM హామీ ఇచ్చారు.

Similar News

News January 1, 2026

కోతితో సినిమా చేస్తున్న మురుగదాస్!

image

స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాలు తీసిన డైరెక్టర్ AR మురుగదాస్ ఇటీవల వరుస ఫ్లాప్‌లను చూశారు. రజనీకాంత్‌తో ‘దర్బార్’, సల్మాన్‌తో ‘సికిందర్’, శివకార్తికేయన్‌తో ‘మదరాసి’ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వినూత్న ప్రయోగానికి సిద్ధమయ్యారు. తన నెక్స్ట్ సినిమాలో కోతిని లీడ్ రోల్‌గా చూపించనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ పూర్తిగా పిల్లల కోసం ఉంటుందని తెలిపారు. దీనిని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

News January 1, 2026

ఖురాన్‌పై ప్రమాణం చేసిన న్యూయార్క్ మేయర్ మమ్‌దానీ

image

న్యూయార్క్ నగర మేయర్‌గా భారత మూలాలున్న జోహ్రాన్ మమ్‌దానీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లాం మతాన్ని ఆచరించే ఆయన ఖురాన్‌పై ప్రమాణం చేసిన తొలి మేయర్‌గా నిలిచారు. 1945లో మూసివేసిన సిటీ హాల్ IRT సబ్‌వే స్టేషన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అద్దెల నియంత్రణ, ఫ్రీ బస్సు సర్వీస్, ఫ్రీ చైల్డ్‌కేర్ వంటి హామీలతో మమ్‌దానీ ఎన్నికల్లో గెలిచారు. నిధుల కోసం సంపన్నులపై పన్నులు పెంచుతామని ప్రకటించారు.

News January 1, 2026

నితీశ్ ఆస్తులు: ₹1.48 కోట్ల ఫ్లాట్.. ₹11.32 లక్షల కారు

image

బిహార్ CM నితీశ్ కుమార్ సహా ఆయన క్యాబినెట్ మంత్రులు 2025 చివరి రోజు నాటికి వారి ఆస్తుల వివరాలు వెల్లడించారు. నితీశ్ చేతిలో ₹20,552 నగదు, మూడు బ్యాంక్ అకౌంట్లలో కలిపి ₹57,766 అమౌంట్ ఉంది. ₹2.03 లక్షల విలువ చేసే జువెలరీ, ₹11.32 లక్షల ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు ఆస్తుల లిస్ట్‌లో ఉన్నాయి. మొత్తం ఆయన చరాస్తుల విలువ ₹17,66,196. అలాగే ₹1.48 కోట్ల మార్కెట్ విలువ చేసే ఫ్లాట్ కూడా ఉంది.