News September 11, 2024

మంత్రి లోకేశ్‌కు హీరో సాయిధరమ్ తేజ్ విరాళం అందజేత

image

వరదలతో నిరాశ్రయులుగా మారిన ప్రజలను ఆదుకోవడానికి సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన చెక్కును మంత్రి లోకేశ్‌కు సచివాలయంలోని 4వ బ్లాక్‌లో అందజేశారు. ఆయనతో పాటు డిక్షన్ గ్రూప్ ప్రతినిధులు రూ.1 కోటి వరద బాధితుల సహాయార్థం విరాళంగా అందజేశారు. వారికి మంత్రి ధన్య వాదాలు తెలిపారు.

Similar News

News July 8, 2025

గుంటూరు: ఇసుక నిల్వలు సిద్ధం

image

గుంటూరు జిల్లాలో వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా 3.5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఇసుకను కృష్ణానదిలో నుంచి తరలించి స్టాకు పాయింట్లలో నిల్వ చేశారు. లింగాయపాలెం-1, 2, బోరుపాలెం, గుండిమెడలపైగా చౌడవరం, పెదకాకాని, ప్రాతూరులో మాన్సూన్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వరదలతో మైనింగ్ ఆగినా ప్రజలకు ఇసుక కొరత తలెత్తదని సమాచారం. ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

News July 8, 2025

గుంటూరు మిర్చికి జాతీయ గుర్తింపు

image

ఓడీఓపీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన మిర్చిపై రూపొందించిన సమగ్ర నివేదికకు కేంద్ర వాణిజ్య శాఖ జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. జిల్లా ఉద్యాన శాఖ ప్రణాళికా ఆధారంగా రూపొందించిన నివేదిక రాష్ట్ర స్థాయిలో ఎంపికై, దేశంలోని ఏడు ఉత్తమ నివేదికలలో స్థానం సంపాదించింది. జులై 14న ఢిల్లీలో కలెక్టర్ నాగలక్ష్మి అవార్డు అందుకోనున్నారు. ఈ ఘనత పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

News July 7, 2025

పేరెంట్స్-టీచర్ మీటింగ్‌కు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 10న పేరెంట్స్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం విద్యాసంస్థల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపే ప్రక్రియను సోమవారం మధ్యాహ్నానికే పూర్తి చేయాలని సూచించారు.