News January 29, 2025
మంత్రి లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే బుడ్డా

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి లోకేశ్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీశైలం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News November 3, 2025
ASF: చేప పిల్లల పంపిణీలో పారదర్శకతకు ప్రాధాన్యం: మంత్రి

మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్రంలోని నీటి వనరులలో చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకాటి శ్రీహరి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆసిఫాబాద్ (ASF) జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. చేప పిల్లల పంపిణీ పకడ్బందీగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
News November 3, 2025
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ప్రతిమ

ఈ నెల 15న నిర్వహించబోయే లోక్ అదాలత్‌పై కోర్టు న్యాయవాదులతో జనగామ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ సోమవారం సమావేశం నిర్వహించారు. సివిల్, మ్యాట్రిమోనియల్, యాక్సిడెంట్, చెక్ బౌన్స్‌తో లాగి పలు కేసుల రాజీ పద్ధతిపై చర్చించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు.
News November 3, 2025
ANU: వ్యాయామ విద్య పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంMR ప్రారంభం కానున్న బీపీఈడీ, డీపీఈడీ, ఎంపీఈడీ వ్యాయామ విద్య పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం సాయంత్రం తెలిపారు. పరీక్ష ఫీజు, తదితర వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు.


