News March 18, 2025
మంత్రి వర్గ సమావేశంలో మంత్రి గుమ్మిడి

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న కీలక నిర్ణయాల్లో ఆమె భాగస్వామ్యం అయ్యారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపారని ఆమె తెలిపారు.
Similar News
News March 18, 2025
నరసరావుపేట: బాలలకు ఆధార్ నమోదు చేపట్టాలి

జిల్లాలోని బాలలకు ఆధార్ నమోదు కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ అరుణబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి నెలలో రెండు దఫాలుగా ఆధార్ క్యాంపులు చేపట్టాలని అధికారులకు సూచించారు. 19-22 వరకూ, 25-28 వరకూ మొత్తం 8 రోజుల పాటూ పాటు క్యాంపులు ఈ క్యాంపుల ద్వారా జిల్లాలో 20వేల మంది బాలలకు ఆధర్ ఆధార్ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు.
News March 18, 2025
జగిత్యాల జిల్లాలో 40.4 హయ్యెస్ట్ టెంపరేచర్

జగిత్యాల జిల్లాలో మంగళవారం అత్యధికంగా రాయికల్ మండలం అల్లిపూర్, వెల్గటూర్, బుగ్గారం మండలం సిరికొండ, ఎండపల్లి మండలం మారేడుపల్లి, ధర్మపురి మండలం జైన, సారంగాపూర్ మండలాల్లో 40.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జగిత్యాల, బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మల్లాపూర్ మండలం రాఘవపేట, వెల్గటూర్ మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 18, 2025
ASF: హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భరోసా

హెడ్ కానిస్టేబుల్ ఎండీ బషీరుద్దీన్ కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు రూ. 2.20 లక్షల చెక్కును అందించారు. బషీరుద్దీన్ ఇస్గాం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుూ అనారోగ్యంతో మృతి చెందినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య వచ్చిన తమకు తెలుపాలని అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు.