News October 14, 2025

మంత్రి సీతక్క చొరవ.. జంపన్న వాగు వద్ద మళ్లీ బోటు

image

ఏటూరునాగారం మండలం దొడ్ల జంపన్న వాగు వద్ద రవాణా సౌకర్యం పునరుద్ధరించారు. నిన్న భారీ వర్షాలకు వాగు ఉప్పొంగడంతో, మల్యాల, కొండాయి, ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం మంత్రి సీతక్క దృష్టికి వెళ్లగా ఆమె తక్షణమే స్పందించి, తాత్కాలికంగా తొలగించిన బోటును మళ్లీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఈరోజు బోటు ఏర్పాటు కావడంతో రవాణా సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Similar News

News October 14, 2025

తాజా రౌండప్

image

* తప్పిపోయిన పిల్లల కేసుల పర్యవేక్షణకు ప్రతి రాష్ట్రంలో నోడల్ అధికారులను నియమించాలని SC ఆదేశాలు
* ఈ నెల 18న BC సంఘాలు నిర్వహించే బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన TG జనసమితి చీఫ్ కోదండరాం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రెండో రోజు 10 మంది నామినేషన్లు దాఖలు
* TG ఇరిగేషన్ శాఖలో 106 మంది అధికారులు క్షేత్రస్థాయిలో బదిలీ
* నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 81, సెన్సెక్స్ 297 పాయింట్లు పతనం

News October 14, 2025

యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సైనికుడు మృతి

image

రాజస్థాన్‌లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సంగడిగుంటకు చెందిన తేజ్ భరద్వాజ్ మరణించారు. దేశ సేవపై మక్కువతో సైన్యంలో చేరిన భరద్వాజ్ ప్రమాదవశాత్తు మరణించడం సైన్యం, కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం ఇవాళ సాయంత్రానికి సంగడిగుంటలోని నివాసానికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

News October 14, 2025

భీమ్‌గల్: పాఠశాల బస్సు కిందపడి బాలుడి మృతి

image

భీమ్‌గల్ మండలం రహత్‌నగర్‌లో మంగళవారం కృష్ణవేణి స్కూల్ బస్సు కిందపడి శ్రీకాంత్(3) అనే బాలుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం.. ఉదయం పాఠశాలకు అతని అన్నను బస్సులో ఎక్కించడానికి కుటుంబీకులతో వెళ్లిన సమయంలో బస్సు చక్రాల కింద పడ్డాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడు కోమాలోకి వెళ్లడంతో వైద్యం కోసం NZB తీసుకెళ్లగా మృతి చెందాడు.