News December 12, 2025
మంత్రి సీతక్క పర్యటించిన దక్కని ఫలితం..!

ములుగు జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన తడ్వాయి, ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ రెండు పంచాయతీల్లో గెలుపు లక్ష్యంగా మంత్రి సీతక్క పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ 2 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఏటూరునాగారంలో సుమారు 3000 పైచిలుకు భారీ మెజారిటీతో ప్రత్యర్థి పార్టీ గెలవడం పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.
Similar News
News December 13, 2025
దేశంలో రోడ్డు లింక్ లేని గ్రామాలు 40547: కేంద్రం

స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లవుతున్నా దేశంలో ఇంకా 40547 గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. ఈ జాబితాలో MPలో 9246, గుజరాత్‌లో 2443, ఛత్తీస్‌గఢ్‌లో 2692, J&Kలో 2262, ఝార్ఖండ్ 2787, కేరళ 2335, WBలో 2748 గ్రామాలున్నాయి. APలో 413, TGలో 173 గ్రామాలకు రోడ్ల లింకేజ్ లేదని కేంద్రం వెల్లడించింది. PMGSY కింద 2029 నాటికి వీటికి రోడ్ల కనెక్టివిటీ చేపడతామని పేర్కొంది. పార్లమెంటులో ఓ సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
News December 13, 2025
భద్రాద్రి జిల్లాలో రెండో విడతలో ఏకగ్రీవమైన జీపీలు..

భద్రాద్రి జిల్లాలోని 7 మండలాల్లో రేపు రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
వివరాలిలా.. అన్నపురెడ్డిపల్లి(M) గుంపెన – ధారబోయిన నరసింహ, ఊటుపల్లి – వాడే వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట(M) మద్దికొండ- తాటి రామకృష్ణ, రామన్నగూడెం- మడకం నాగేశ్వరరావు, ములకలపల్లి(M) పొగళ్లపల్లి – మడకం రవి, చండ్రుగొండ(M) బెండలపాడు-బొర్రా లలిత, మంగయ్య బంజర- మాలోత్ గోపికృష్ణ.
News December 13, 2025
15న టెక్కలిలో ప్రజా వేదిక: కలెక్టర్

ఈనెల 15న టెక్కలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం తెలిపారు. టెక్కలి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని నూతన సమావేశ మందిరంలో నిర్వహిస్తారని చెప్పారు. ఈ వేదికలో ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


