News March 13, 2025
మంత్రులతో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌తో విజయనగరం ఉమ్మడి జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు ఎస్ కోట ఎమ్మెల్యే లలిత కుమారి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, విజయనగరం ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర తదితరులు అసెంబ్లీ లాబీలో గురువారం కలుసుకున్నారు.
Similar News
News March 9, 2026
నారాయణపేట బంగారానికి జీఐ ట్యాగ్..!

బంగారానికి, చేనేత చీరలకు దేశంలోనే నారాయణపేట ప్రసిద్ధి గాంచింది. అలాంటి బంగారానికి జీఐ ట్యాగ్ (భౌగోలిక సూచి) గుర్తింపు కోసం ఇక్కడి బంగారు వ్యాపారస్థులు కృషి చేస్తున్నారు. ఇక్కడి బంగారు వ్యాపారానికి 130 ఏళ్ల చరిత్ర కలిగింది. సుమారు 150 బంగారు దుకాణాలు ఉండగా, 270 మందికిపైగా బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు ఉన్నారు. 24 క్యారెట్ల బంగారంతో అధునాతన డిజైన్లు చేయగల ఘనత ఇక్కడి స్వర్ణకారుల సొంతం.
News March 9, 2026
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై స్టే

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రయల్ కోర్ట్ తీర్పులో సీబీఐపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కవితలతో సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఇటీవల వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది.
News March 9, 2026
లాభాల పేరిట భారీ స్కామ్స్: పల్నాడు ఎస్పీ

సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఇన్వెస్ట్‌మెంట్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో అధిక లాభాల ఆశచూపి కేటుగాళ్లు అమాయకులను దోచుకుంటున్నారని తెలిపారు. తెలియని వ్యక్తులు ఇచ్చే ట్రేడింగ్ టిప్స్ నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు. బాధితులు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు.


