News January 5, 2026

మంత్రులతో ఎమ్మెల్యే రాధాకృష్ణ భేటీ

image

మంత్రులతో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం భేటీ అయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డిని కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడిని కలిసి తణుకు నియోజకవర్గానికి సంబంధించి రానున్న రోజుల్లో యూరియా అవసరాలపై చర్చించారు.

Similar News

News February 6, 2026

ప.గో: వరి రైతులకు ‘ఎలుక గండం’

image

ప.గో. జిల్లాలో రబీ సాగు చేస్తున్న రైతులు ఎలుకల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2.25 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసిన రెండో వారం నుంచే తెగుళ్లు, ఎలుకలు పంటను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి నిర్మూలనకు హెక్టారుకు రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. అధికారులు సామూహిక చర్యలు చేపడుతున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదని సాగుదారులు ఆరోపిస్తున్నారు.

News February 6, 2026

ఈ-కేవైసీ గడువులోగా పూర్తి చేయాలి: జేసీ

image

పట్టాదారు పాసుపుస్తకాల వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఉండి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఈ-కేవైసీ పూర్తికాని పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందించాలని స్పష్టం చేశారు.