News November 23, 2025
మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్

తెలంగాణ మంత్రులు, పలు శాఖల అధికారిక వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. SBI ఆధార్ అప్‌డేట్ పేరుతో ప్రమాదకర APK ఫైల్స్ షేర్ అయ్యాయి. ఆ ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అప్పటికే ఓపెన్ చేసిన పలువురు జర్నలిస్టులు.. తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు చేస్తున్నారు.
Similar News
News November 23, 2025
భారీ జీతంతో SIDBIలో ఉద్యోగాలు

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<
News November 23, 2025
‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ ఎలా ఉందంటే?

OTTలో ట్రెండింగ్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ నుంచి మూడో సీజన్ విడుదలైంది. ఈశాన్య భారతంలో నడిచే కథతో దర్శకులు రాజ్, డీకే కొత్త ప్రపంచానికి తీసుకెళ్లారు. మనోజ్ బాజ్‌పాయ్ నటన, విజయ్ సేతుపతి క్యామియో, కొత్త పాత్రల్లో జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ అదరగొట్టారు. గత సీజన్లతో పోలిస్తే యాక్షన్ తక్కువగా ఉండటం, బలమైన కథ లేకపోవడం నిరాశపరుస్తాయి. చివర్లో సీజన్ 4 ఉందని హింట్ ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది?
News November 23, 2025
ఇతిహాసాలు క్విజ్ – 75 సమాధానాలు

ప్రశ్న: పాండవుల పక్షం వహించిన దృతరాష్ట్రుడి పుత్రుడెవరు?
జవాబు: పాండవుల తరఫున యుద్ధం చేసిన దృతరాష్ట్రుడి పుత్రుడు ‘యుయుత్సుడు’. ఆయన గాంధారి దాసి సుఖదకు జన్మించాడు. దాసీ పుత్రుడు అయినందుకు కౌరవులు దూరం పెట్టేవారు. ద్రౌపతి వస్త్రాపహరణాన్ని అడ్డుకున్నాడు. ధర్మంవైపు నిలిచి కౌరవులతో పోరాడాడు. కురుక్షేత్రంలో మరణించని కౌరవ వీరుడిగా నిలిచారు. ఆ తర్వాత హస్తినాకు సైన్యాధిపతిగా నియమించారు. <<-se>>#Ithihasaluquiz<<>>


